Tuesday, August 18, 2026
HomeTelanganaశ్రీ విశ్వనాథ ఆలయంలో కూచిపూడి నృత్య కళా వైభవం

శ్రీ విశ్వనాథ ఆలయంలో కూచిపూడి నృత్య కళా వైభవం

📰 Generate e-Paper Clip

మహాశివరాత్రి వేడుకల్లో కళా సంబరం 

శిష్య బృందంతో మెప్పించిన గురువు కల్పన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గల శ్రీ విశ్వనాథ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ నందిని నృత్యాలయం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఫౌండర్ మరియు గురువు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్‌లెన్స్ అవార్డు గ్రహీత, అన్నం కల్పన తన శిష్య బృందంతో శివతాండవం, భక్తి భావాలను ప్రతిబింబించే నృత్య రూపకాలను అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో, అర్చకులు సమన్వయంతో నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. నృత్య ప్రదర్శన అనంతరం కళాకారుల ప్రతిభను గుర్తించి వారికి అవార్డులు ప్రదానం చేయగా, గురువు కల్పనను ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రతి మహాశివరాత్రికి శ్రీ నందిని నృత్యాలయం శివభక్తితో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కూచిపూడి నృత్య వైభవం మహాశివరాత్రి వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చిందని భక్తులు, కళాభిమానులు ప్రశంసలు కురిపించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.