శ్రీ విశ్వనాథ ఆలయంలో కూచిపూడి నృత్య కళా వైభవం

మహాశివరాత్రి వేడుకల్లో కళా సంబరం  శిష్య బృందంతో మెప్పించిన గురువు కల్పన ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గల శ్రీ విశ్వనాథ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ నందిని నృత్యాలయం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఫౌండర్ మరియు గురువు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్‌లెన్స్ అవార్డు గ్రహీత, అన్నం కల్పన తన శిష్య బృందంతో శివతాండవం, భక్తి భావాలను ప్రతిబింబించే నృత్య రూపకాలను అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను...