Tuesday, August 18, 2026
HomeTelanganaమేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ఘన ప్రమాణ స్వీకారం

మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ఘన ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి: నూతన పాలకవర్గం హామీ

మేయర్ ధరణి మధుకర్,  డిప్యూటీ మేయర్ సల్ల రమ్య,

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రం లో ఉన్న నగరపాలక సంస్థలో నూతన పాలకవర్గం కొలువు తీరింది. జిల్లాలో 60 డివిజన్లతో కూడిన నూతనంగా ఏర్పడిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ధరణి మధుకర్ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. నూతన కార్పోరేషన్ గా ఏర్పడిన మంచిర్యాల మొదటి మేయర్ గా ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో మేయర్ గా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు . గత నాలుగు రోజుల నుండి ఎవరు మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్ అనే ఉత్కంఠకు నేటితో తెరపడింది . పలువురు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆశించినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులు ధరణి మధుకర్ అలాగే సల్ల రమ్యకు లభించినవి . మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ధరణి మధుకర్ డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్యను కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు ఎన్నుకున్నారు . 60 డివిజన్లలో 44 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికార పీఠాన్ని హుందాగా దక్కించుకుంది. 60 కార్పోరేటర్లతోపాటు ఒక స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎక్స్ అఫీషియల్ సభ్యుడుగా మొత్తం 61 మంది 45 మంది లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్ తూముల నరేష్ మంచిర్యాల మేయర్ గా ధరణి మధుకర్ పేరును ప్రతిపాదించగా మిగతా సభ్యులు మద్దతు తెలపడంతో మంచిర్యాల మేయర్ గా ధరణి మధుకర్ ప్రమాణస్వీకారం చేశాడు . అలాగే డిప్యూటీ మేయర్ గా రమ్య పేరును మరో కాంగ్రెస్ కార్పోరేటర్ పేరు ప్రతిపాదించగా మిగతా సభ్యులు బలపరచడంతో సల్ల రమ్య డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు…

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.