Wednesday, August 19, 2026
HomeDelhiఈ కీలక సమయంలో రాజీనామానా..? స్పందించిన కాంగ్రెస్

ఈ కీలక సమయంలో రాజీనామానా..? స్పందించిన కాంగ్రెస్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వివిధ అంశాలపై భాజపాతో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీ వీడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.

‘గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ సీనియర్ నేత, ద్రవ్యోల్బణం, విభజన రాజకీయాలు, పలు అంశాల పై భాజపాతో పోరాడుతోన్న సమయంలో ఆయన పార్టీని వీడటం విచారకరం, దురదృష్టకరం’ అని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే ఈ రాజీనామా లేఖలో పేర్కొన్న విషయాలను ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఆ లేఖలో పేర్కొన్న విషయాలు వాస్తవం కాదన్నారు. దానిలో ఆజాద్.. రాహుల్ ను తీవ్రంగా విమర్శించారు. ఆయన రాకతో పార్టీ పతనం మొదలైందని మండిపడ్డారు. పరిణతి లేని ఆయన నాయకత్వంతోనే తాను పార్టీ నుంచి భారమైన హృదయం వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కు ఇది మామూలు ఎదురుదెబ్బ కాదు..!
గులాం నబీ ఆజాద్ రాజీనామా సమర్పించడం.. కాంగ్రెస్ కు మామూలు ఎదురుదెబ్బ కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. `ఆయన పార్టీ వీడటం గురించి మొదట్లో పుకార్లు వినిపించాయి. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్ కు మామూలు ఎదురుదెబ్బ కాదు. ఇటీవల కాలంలో హస్తం పార్టీని వీడిన సీనియర్ నేత ఆయన. ఆయన రాజీనామా లేఖ చదవడం బాధగా అనిపించింది. భారతదేశంలోని పురాతన పార్టీలో ఈ పరిణామాలు భయానకంగా కనిపిస్తున్నాయి’ అంటూ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.