Wednesday, August 19, 2026
HomeTelanganaరాహుల్.. వైట్ ఛాలెంజ్ సిద్ధమా?: హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు

రాహుల్.. వైట్ ఛాలెంజ్ సిద్ధమా?: హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: నగరంలో రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా అంటూ ప్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్, గస్పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారు. ఈ నెల 6, 7 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. గతంలో వైట్ ఛాలెంజ్పై కాంగ్రెస్, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. హైదరాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. ఆ సమయంలో రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ‘వైట్’ ఛాలెంజ్’ పేరిట సవాల్ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఆయన సవాల్ విసిరారు.

దీనిపై స్పందించిన కేటీఆర్.. ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ సిద్ధమేనా అని.. ఆయన ఒప్పుకుంటే దిల్లీ ఎయిమ్స్ పరీక్షలకు సిద్ధమని కేటీఆర్ ప్రతిసవాల్ విసిరిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ఇటీవల నేపాల్లోని ఓ పబ్లో కనిపించిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల చర్చనీయాంశంగా మారాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.