రాహుల్.. వైట్ ఛాలెంజ్ సిద్ధమా?: హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు

హైదరాబాద్: నగరంలో రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా అంటూ ప్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్, గస్పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారు. ఈ నెల 6, 7 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. గతంలో వైట్ ఛాలెంజ్పై కాంగ్రెస్, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. హైదరాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. ఆ సమయంలో రాష్ట్రంలో...