స్మార్ట్ తేరలకే అతుక్కుపోతున్న చిన్నారులు
వద్దంటే ఆగమం..,
నివారణ చర్యలు తీసుకోకుంటే తీవ్ర దుష్ర్పభావాలు
హెచ్చరిస్తున్నా మానసిక వైద్యులు
హైదరాబాద్: బాల్యం స్మార్ట్ఫోన్లో బందీ అవుతున్నది. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి నిద్ర పోయేవరకు ఏ ఇంట్లో చూసినా పిల్లలు స్మార్ట్ఫోన్లు ట్యాబ్ల్లోనెె మునిగి తేలుతున్నారు. ఫోన్ లకు బానిసలుగా మారి చిన్న చిన్న విషయాలకే విపరీతంగా ప్రవర్తిస్తున్నారు.1-12 ఏండ్లు మధ్యవయస్కుల్లో ఈ ధోరణి అధికంగా కనిపిస్తుంది. ఆట పాటలు లేవు.. తోటి పిల్లలతో ఆడుకోవడం లు లేవు… ఎంతసేపు ఫోన్ లో వీడియోలు చూస్తూ పోవద్దు పుచ్చుకున్నారు. దీంతో చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. అల్లరి ఆపాలనో, ఇతర అ ఏ కారణంతోనో పిల్లల కు తల్లిదండ్రులే ఫోన్ లు చూడటం అలవాటు చేస్తున్నారు. తాత్కాలికంగా పిల్లల ఈ చేష్టలు ముద్దుగా అనిపించినా స్మార్ట్ఫోన్లు అతి వినియోగ తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తుందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల వినియోగం పిల్లల్లో ఎలాంటి మార్పులు చేస్తున్నది అన్నదానిపై ప్యాంటు, ఫ్యామిలీ హేల్త్ తదితర సంస్థలు నిర్వహించిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
స్మార్ట్ ఫోన్ అత్వినియోగంతో అనర్థాలు
• కోపం ఆనందం వంటి భావోద్వేగాలు అదుపులో పెట్టుకో లేకపోవడం.
• దృష్టి సంబంధిత అనారోగ్యాలు కంటి రెటీనా నరాలు దెబ్బతినడం
• చేతి వేళ్ళు కీళ్లు త్వరగా అరిగిపోవడం
• వెన్నెముక సంబంధిత సమస్యలు, మెడ నొప్పులు, ఏకాగ్రత కోల్పోవడం, నిద్రలేమి, ఆహారం సరిగా తీసుకోకపోవడం, శారీరక బలహీనత
నివారణ మార్గాలు…..
• తల్లిదండ్రులు పిల్లలను నిరంతరం పర్యవేక్షిస్తారు ఉండాలి. ఎక్కువ సేపు వారితో గడపాలి.
• సమవయస్కులు లతో మైదాన ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.
• చిన్నారులకు పజిల్ ఫిజికల్ చాలెంజింగ్ తదితర పరీక్షలు పెట్టాలి
• ఫోన్ లకు ఆటోమేటిక్ లాక్ సిస్టం సెట్ చేయాలి, కంటిపై ప్రభావం పడకుండా సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ ను వీలైనంత తగ్గించాలి
వివిధ సర్వేలలో తేలిన అంశాలు..?
• యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా మూడు నుంచి 11 ఏళ్ల వయసు 80 శాతం
• అతిగా వినియోగిస్తున్న చిన్నారులు 53%
• నిర్ణీత గడువు వరకే వాడుతున్నవారు 4%
• ఫోన్ లను అతి తక్కువ సమయం వినియోగిస్తున్న వారు మూడు శాతం
• పిల్లల పెంపకం కష్టమవుతున్నది అని భావిస్తున్నాను తల్లిదండ్రులు 66%
• ఫోన్లకే ఆత్తుకుపోవటంతో నైపుణ్యాలపై ప్రభావం 71%
• పాఠశాల లో విపరీత ప్రవర్తన 54%, స్నేహితులతో గొడవ పడుతున్న వరు 68%, సృజనాత్మకత కోల్పోతున్న వారు 46%, హాబీలు అలవాట్లు దెబ్బతింటున్న వారు 45%, చిన్నారుల ప్రవర్తనపై డాక్టర్ల సంపాదిస్తున్న వారు 61%, తల్లిదండ్రుల సలహాలు తీసుకుంటున్న వార 55%