Telugu Updates
Logo
mobile after logo

వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా కూచిపూడి నృత్యాన్ని పరిరక్షిస్తున్న గురువు కల్పన

శ్రీ నందిని నృత్యాలయంలో సంప్రదాయ నృత్యానికి కొత్త ఊపిరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా:  వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా భారతీయ సాంప్రదాయ నృత్య కళలకు మరింత గుర్తింపు లభిస్తున్న వేళ, కూచిపూడి నృత్యాన్ని కాపాడుతూ, కొత్త తరానికి అందిస్తున్న గురువు కల్పన కృషి ప్రశంసనీయం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ నందిని నృత్యాలయం గురువు, డాక్టర్” ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత కల్పన ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యానికి గత 28 సంవత్సరాలుగా శిక్షణ అందిస్తూ దాదాపు 40,000 వేల మంది శిష్యులను తీర్చిదిద్దారు. అలాగే చిన్నారులు నుంచి యువత వరకు ఈ నృత్య కళపై ఆసక్తి పెంచేలా ఆమె మార్గదర్శనం చేస్తున్నారు.. ఈ సందర్భంగా గురువు కల్పన మాట్లాడుతూ.. కూచిపూడి నృత్యం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అద్భుత కళారూపమని, దాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి కళాకారుడి బాధ్యత అని గురువు కల్పన పేర్కొన్నారు. నేటి డిజిటల్ యుగంలో సాంప్రదాయ కళలపై ఆసక్తి తగ్గుతున్న తరుణంలో, ఇలాంటి నృత్యాలయాలు కళలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె అన్నారు. నృత్యం ద్వారా శిష్యుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరుగుతాయని వివరించారు. వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా శిష్యులు ప్రత్యేక ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారని, ఈ కార్యక్రమం ద్వారా కూచిపూడి నృత్యం గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. “సాంప్రదాయ కళలను కాపాడటం మనందరి బాధ్యత కూచిపూడి నృత్యం మన సంస్కృతికి ప్రతిబింబం” అని అన్నారు.. కళను కాపాడుతూ, సమాజానికి అందిస్తున్న గురువు కల్పన సేవలు ఆదర్శప్రాయమని పలువురు అభినందిస్తున్నారు.

Post bottom