Thursday, July 2, 2026
HomeTelanganaరెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు

రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తల సేమియా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, అత్యవసర సేవల నిమిత్తం జిల్లాలోని రెవెన్యూ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన మొదటగా చెన్నూర్ తహసిల్దార్ ఆధ్వర్యంలో చెన్నూర్ పట్టణంలోని పాత మార్కెట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్చే రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా మన ఆరోగ్యంతో పాటు తల సేమియా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, ప్రమాదాలలో గాయపడిన వారికి, గర్భిణీ స్త్రీలకు అత్యవసర సమయాలలో రక్తాన్ని అందించి కాపాడుకోవచ్చని తెలిపారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ రక్తదాన శిబిరాలలో ప్రజలు, యువకులు, డీలర్లు, రెవెన్యూ సిబ్బంది అందరూ భాగస్వాములై రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Post bottom
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments