Thursday, July 2, 2026
HomeTelanganaలంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

ఆంజనేయులు న్యూస్, హైద‌రాబాద్: హైద‌రాబాద్ బ‌హ‌దూర్‌పురా పోలీసు స్టేష‌న్‌లో ఎస్ఐగా విధులు నిర్వ‌ర్తిస్తున్న ఆర్ శ్ర‌వ‌ణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. ఓ సిటిజెన్ నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఎస్ఐని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Post Midle

ఓ కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఓ వ్య‌క్తి ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే త‌న ఫోన్ త‌న‌కు తిరిగి ఇవ్వాల‌ని బాధిత వ్య‌క్తి ఎస్ఐ శ్ర‌వ‌ణ్ కుమార్‌ను సంప్ర‌దించాడు. ఈ క్ర‌మంలో ఎస్ఐ లంచం డిమాండ్ చేయ‌డంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర‌యించాడు. ఎస్ఐ రూ. 8 వేలు లంచం తీసుకుంటుండ‌గా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఏసీబీ కోర్టులో హాజ‌రుప‌రిచారు.

Post bottom
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments