Thursday, July 2, 2026
HomeTelanganaరాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త!!

రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త!!

తెలంగాణ: తెలంగాణలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 5, 111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించింది. ఈ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్దారులకు కార్డులు మంజూరు చేయనున్నారు.

Post Midle

దీంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కోఠి ఈఎన్. టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది..

Post bottom
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments