Telugu Updates
Logo
mobile after logo

పోస్టుల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్ ఏరియాలో పోస్టుల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డికి వారు శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం ఏరియా కన్వీనర్ డేగల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్డీఆర్ ప్రకారం పోస్టులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గోదారి మురళి, శెట్టి శంకరయ్య, అందే వెంకటేష్, వేల్పుల ప్రవీణ్, కుక్క శ్రీనివాస్, సుందిల్ల నరేష్ పాల్గొన్నారు.

Post bottom