
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: నస్పూర్ మున్సిపాలిటీ 7వ వార్డు పరిధిలోని బుడిగ జంగాల వాడలో సిసి డ్రైయిన్ నిర్మాణం పనులను ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


