Telugu Updates
Logo
mobile after logo

నిరుపేద విద్యార్థిని శస్త్రచికిత్స కొరకు తక్షణ ఆర్థిక సహాయం

జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నిరుపేద విద్యార్థిని నల్ల ప్రసన్నాంజలి శస్త్రచికిత్స కొరకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శనివారం తెలిపారు. అపెండిసైటిస్ తో బాధపడుతూ సమస్య తీవ్రం కావడంతో విద్యార్థినిని ఆసుపత్రిలో చేర్పించి శస్త్ర చికిత్స అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందని, ఈ మేరకు విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. విద్యార్థిని వైద్య సేవలకు అయిన ఖర్చులను జిల్లా కన్వీనర్ సేరు శ్రీధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు చెల్లిస్తారని తెలిపారు. విద్యార్థిని ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులకు సూచించారు.

Post bottom