Telugu Updates
Logo
mobile after logo

ఎంపీ కాన్వాయ్ పై దాడి ప్లాన్ ప్రకారమే..? కేంద్ర హోం మంత్రి అమితాషా

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై జరిగిన దాడిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిందని తెలియగానే స్వయంగా.. ఎంపీ అర్వింద్కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అర్వింద్ వివరించారు. “భాజపా నేతలు, కార్యకర్తలను అధికార తెరాస పార్టీ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అర్వింద్ ఎక్కడ తిరిగినా దాడులు చేయాలని తెరాస నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించింది. ఇవాల్టి దాడి వెనుక ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారు” అని హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు..

Post bottom