Thursday, July 2, 2026
HomeDelhiమంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు

మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు

తెరాస నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు జారీ చేసి రేపు విచారణకు హాజరు కావాలని కోరింది.

Post Midle

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: తెరాస నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కు సంబంధించిన కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, తెరాస ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు ఇచ్చింది. రేపు ఢిల్లీలో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించారు. అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్.. మంత్రి కమలాకర్ టచ్ లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. తనకు ఉన్న పరిచయాల ద్వారా గ్రానైట్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఉపశమనం వచ్చేలా శ్రీనివాస్ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ లొనీ మంత్రి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. శ్రీనివాస్ తో సంబంధాలు, ఎవరెవరితో మాట్లాడారు తదితర అంశాలపై గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర వాంగ్మూలం నమోదు చేసేందుకే నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ వెల్లడించింది.

Post bottom
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments