Telugu Updates
Logo
mobile after logo

మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే 

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం వట్టివాగు కాలనీలో గల గిరిజన ప్రాథమిక పాఠశాల/ దిశా ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. మధ్యాహ్న భోజనం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, వంట సిబ్బంది పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. 4వ తరగతి విద్యార్థులకు పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. విద్యార్థులు సౌర కుటుంబం, గ్రహాల గురించి ఆంగ్లంలో వివరించడంతో విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, ఎ. సి. ఓ. పుర్క ఉద్ధవ్, ఎస్. సి. ఆర్. పి. రవీందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంరం మాధవరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Post bottom