Thursday, July 2, 2026
HomeTelanganaబాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే

📰 Generate e-Paper Clip

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్

Post Midle

ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నందు సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి నిర్మల్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే పిర్యాదు దారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో అని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను మా దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.