మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్ యూనియన్ (టీ.ఎం.ఎస్.ఆర్.యు) మంచిర్యాల శాఖ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్ యూనియన్ (టీ.ఎం.ఎస్.ఆర్.యు) మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రాష్ట్ర కమిటీ సభ్యులు లెక్కల సాగర్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్ ల వలన దేశం లో ఉన్న కార్మిక వర్గానికి, మెడికల్ & సేల్స్ రిప్రెజెంటేటివ్స్ తీవ్ర అన్యాయం జరుగుతుందని, యూనియన్ ఏర్పాటు చేసుకొనే హక్కును, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కూడా కాలరాసేలా ఈ చట్టాలు ఉన్నాయని అలాగే మెడికల్, సేల్స్ రిప్రెజెంటేటివ్స్ కోసం ఏర్పాటు చేయబడిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ (ఎస్పీఇ) 1976 యాక్ట్ ను రద్దు చేయడంతో దేశ వ్యాప్తంగా పని చేస్తున్న మెడికల్, సేల్స్ రిప్రెజెంటేటివ్స్ కి కనీస వేతన చట్టం, బోనస్ చట్టం, గ్రాట్యుటీ చట్టం, ఇలాంటి ఎన్నో చట్టాల అమలు ప్రశ్నార్ధకంగా మారుతుందని తెలిపారు. మా డిమాండ్స్ అయినటువంటి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ని వెంటనే రద్దు చేయాలి, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ (ఎస్పీఇ ) 1976 యాక్ట్ ను పునరుద్దరించాలి, మరియు మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్ కి చట్టబద్ధమైన పని విధానాలను రూపొందించాలని తెలిపారు.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిచో దీనికి వ్యతిరేకంగా మెడికల్, సేల్స్ రిప్రెజెంటేటివ్స్ పని ప్రదేశాలలో నవంబర్ 24, 25, 26 తేదీలలో రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా నల్ల బ్యాడ్జ్ లు ధరించి పని చేస్తారని అవసరమైతే ధర్నాలు, నిరసనలు, చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.. ఈ కార్యక్రమం లో (టీ.ఎంఎస్ఆర్.యు) రాష్ట్ర కమిటీ సభ్యుడు సాగర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుమార్, సంతోష్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


