Telugu Updates
Logo
mobile after logo

జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు.. త్వరలో కొత్త నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణలో టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు చేశారు. 1000 పోస్టులకు జులై 17న రాత పరీక్ష నిర్వహించగా.. 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ పాల్పడినట్లు హైదరాబాద్, రాచకొండ పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. ఘట్కేసర్ పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి చరవాణితో చిక్కడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తమకు సమాధానాలు చెబుతామని రూ. లక్షలు తీసుకుని మోసం చేశారని కొందరు ఉద్యోగులపై ఓ అభ్యర్థి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు ఏడీఈలతో సహా ఐదుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి..

ఈ కేసులో ఇప్పటికే పాత్ర ఉన్న ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయంపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి స్పందిస్తూ.. మాల్ ప్రాక్టీస్ జరిగిన నేపథ్యంలో గతంలో నిర్వహించిన జూనియర్ లైన్మెన్ పరీక్షను రద్దు చేశామని.. త్వరలో కొత్త నోటిఫికేషన్ ప్రకటిస్తామని తెలిపారు..

Post bottom