
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి కాసిపేట మండలం భూ వివాదంలో శనివారం హత్యకు గురైన ఏముర్ల ఎల్లమ్మ హత్య కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గంగారాం తెలిపారు. చిప్పకుర్తి భూమక్క, గొడిసెల బాలయ్య కుటుంబాల మధ్య కొంతకాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం బెల్లంపల్లి నుంచి సాగు చేసిన పత్తి పంటను చూసేందుకు వచ్చిన ఎల్లమ్మపై బాలయ్య, లక్ష్మీ, క్రాంతి, కళ్యాణ్, కిరణు దాడి చేసి హత్య చేశారని మృతురాలు కొడుకు ఏముర్ల సాగర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆదివారం ఎల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు తెలిపారు.

