Telugu Updates
Logo
mobile after logo

కంటి వెలుగు పథకం విజయవంతంగా పూర్తి

కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధి లోని 15వ వార్డ్ లో గత 18-01-2 023 నుండీ 30-01-2023 వరకు జరిగిన కంటి వెలుగు పథకం విజయవంతంగా పూర్తి అయ్యింది అని సోమవారం కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్ తెలిపారు.. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. ఈ బస్తీ దవాఖాన లో కంటి వెలుగు సేవలు అందించిన డాక్టర్ రమేష్, అప్తోమిక్ నిరుపమ, డేటా ఎంట్రీ సుజాత, ఎఎన్ఎం లు మరియు అంగనివాడి టీచర్ సురేఖ మరియు వారి సిబ్బంది మెప్న సరోజ, ఆర్పీలు రమేష్ కంటి వెలుగు ఇంచర్జ్ పురుషోత్తం లను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా సన్మానించామని. అనంతరం వారికీ భోజనాలను ఎర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో వార్డ్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు మైలారం శ్రీనివాస్, యూత్ ప్రెసిడెంట్ కోత్తురీ సంతోష్, పార్టీ ఉప అధ్యక్షులు తిరుపతి, ఉస్కమల్ల శంకర్, రాయమల్లు, ప్రసాద్, విష్ణు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Post bottom