
మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కెకాన్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఉద్యోగరీత్యా ఎక్కడ పనిచేసినా గణపురం కోటగుళ్లతో తనకు ప్రత్యేక అనుబంధం ఉంటుందని మంచిర్యాల డిసిపి గా నూతనంగా నియమితులైన సుధీర్ రాంనాథ్ కెకాన్ అన్నారు. సంవత్సరానికి పైగా ములుగు ఏఎస్పీగా సేవలందించిన ఆయన బదిలీ పై మంచిర్యాల వెళ్తూ శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ ఆయనను సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గోశాల గోమాతలకు పండ్లను అందజేశారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

