Telugu Updates
Logo
mobile after logo

రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!

ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకులకు కన్సల్టెన్సీల ఫోన్లు..?

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2022-23) అనుబంధ గుర్తింపు పొందేందుకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉత్తుత్తి అధ్యాపకుల కోసం మళ్లీ వేట కొనసాగిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి రప్పించే బాధ్యతను కొన్ని కాలేజీలు కన్సల్టెన్సీలకు అప్పగించాయి. దాంతో కన్సల్టెన్సీల సిబ్బంది కళాశాలల్లో పనిచేసే, మానేసి ఇతర వృత్తుల్లోకి వెళ్లిన వారికి ఫోన్లు చేస్తున్నాయి. ఈ తరహా ఫోన్ రికార్డెడ్ వాయిస్లు కూడా సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేసి వెళితే నెలకు రూ.15 వేలు ఇస్తామని, జేఎన్టీయూహెచ్ తనిఖీల నాడు వస్తే(రెండు సార్లు) రూ.20 వేలు ముట్టజెపుతామని అధ్యాపకులకు ఫోన్లు చేస్తున్నారు. బాచుపల్లిలోని ఓ కళాశాలలో, జేఎన్టీయూహెచ్ సమీపంలోని మరో కాలేజీలో ప్రస్తుతం ఇలాంటి అవకాశం ఉందని కన్సల్టెన్సీల సిబ్బంది చెప్పడం గమనార్హం.

Post bottom