ఆదిలాబాద్ జిల్లా, బోథ్: నేరడిగొండ మండల కేంద్రంలోని తొమ్మిదవ వార్డు పరిధిలోని అంగన్వాడి కేంద్రానికి శాశ్వత భవనం లేక ఓ అద్దె పెంకుటిల్లులో కొనసాగిస్తున్నారు. అది కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు కూలుతుందోనని పిల్లలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. గర్భిణీలు బాలింతలకు సరఫరా చేసే పదార్థాలు వర్షానికి తడిసి ముద్ద అవుతున్నాయి. తమ పిల్లలను పంపడానికి భయపడుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత భవనాన్ని నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు.