
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్ కూలింది. హైదరాబాద్ కు చెందిన హెలికాప్టర్ సోమవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. భారీగా శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కూలిన శిక్షణ హెలికాప్టర్లో మంటలు చెలరేగడంతో ఒకరు లేక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


