రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం సృష్టించారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు తొలిసారి అవకాశం దక్కించుకుని.. విజయాన్నీ సాధించారు. వీరిలో కొందరు రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం సృష్టించారు.
• యశస్వినిరెడ్డి (26): పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మామిడాల యశస్వినిరెడ్డి బరిలో నిలిచి, ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించారు.
• మైనంపల్లి రోహిత్ రావు (26): వైద్యుడైన రోహిత్(కాంగ్రెస్).. మెదక్ లో అప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా దేవేందర్ రెడ్డి (భారాస)పై సంచలన విజయం సాధించారు.
• చిట్టెం పర్ణికారెడ్డి (30): నారాయణపేట నుంచి రేడియాలజిస్ట్ చిట్టెం పర్ణికారెడ్డి(కాంగ్రెస్) వరుసగా రెండుసార్లు గెలిచిన రాజేందర్ రెడ్డి (భారాస)పై విజయం సాధించారు.
• వెడ్మా బొజ్జు (37): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మా బొజ్జుపటేల్ అనూహ్యంగా గెలుపొందారు. భాజపా నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ భారాస నుంచి ఎన్నారై భూక్యా జాన్సన్లతో పోటీపడినా ఓటర్లు మాత్రం బొజ్జుకే పట్టంకట్టారు.
• లాస్య నందిత (38): దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె అయిన నందిత కంటోన్మెంట్ నుంచి భారాస అభ్యర్థిగా పోటీచేసి, స్థానికంగా గుర్తింపు ఉన్న శ్రీగణేష్(భాజపా)పై గెలిచారు.
• కల్వకుంట్ల సంజయ్ (47): స్పైన్ సర్జన్ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(భారాస) కోరుట్లలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(భాజపా)పై గెలిచారు.
• కుందూరు జైవీర్ రెడ్డి (48): నాగార్జునసాగర్ లో జైవీర్ రెడ్డి(కాంగ్రెస్). సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్ (భారాస)పై గెలిచారు.