Telugu Updates
Logo
mobile after logo

కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన: ఎమ్మెల్యే

అదిలాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కార్పొరేట్ స్థాయి లో విద్యా బోధనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తాటిగూడ ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్, కాలనీ వాసులు సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్లాస్ రూమ్ ను శుక్రవారం ఎమ్మెల్యే స్విచ్ అన్ చేసి ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ.. చదువు లేకుంటే సమాజంలో గుర్తింపు ఉండదని, సమాజంలో జరిగే మంచిచెడులు తెలుసుకోవడానికి ఆస్కారం ఉండదని అన్నారు. పిల్లలందరూ టీ శ్యాట్ ద్వారా అందిస్తున్న సాంకేతిక విద్య ను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణిత, వార్డు కౌన్సిలర్ అశోక్ స్వామి, యూనియన్ బ్యాంక్ మేనేజర్, కౌన్సిలర్లు బండారి సతీష్, సంద నర్సింగ్, పందిరి భూమన్న, టిఆర్ఎస్ నాయకులు యూనుస్ అక్బని, సంజయ్, కొండ గంగాధర్, గెడం సంజీవ్, రంగినేని శ్రీనివాసరావు, పాఠశాల హెచ్ఎం నారాయణ, కాలనీవాసులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom