Telugu Updates
Logo
mobile after logo

కార్మెల్ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎసిసిలో గల కార్మెల్ కాన్వెంట్ సీబీఎస్ఇ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సిస్టర్ మరియా అగస్టీన్ హాజరయ్యారు.. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.. ఈ సందర్భంగా సిస్టర్ మరియా మాట్లాడుతూ.. విద్యార్థులకు 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్య్రం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు గొప్ప కీర్తి సంపాదించి పెట్టాలి అని చెప్పారు..

అనంతరం పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, దేశప్రేమను వ్యక్తపరిచారు, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు.. ఈ కార్యక్రమంలో సి.బి.ఎస్.ఇ. పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ రినెట్, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ క్రుపా, స్టేట్ పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ సారూప్య, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ షీమా మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..

Post bottom