Telugu Updates
Logo
mobile after logo

ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం.. మాజీ ఎమ్మెల్సీ పీఎస్ఆర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యేగా తాను గెలవడం ఖాయమని ఎఐసిసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం లక్షేట్టిపేట పట్టణంలో కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడిన గెలిచిన తాను ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని తెలిపారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ప్రజలు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Post bottom