
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలోని కాసిపేట గ్రామంచాయితీ లోని చంద్రపల్లి గ్రామంలో గురువారం సీసీ రోడ్డు పనులను ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వం సీసీ రోడ్డు మంజూరు చేసిందని తెలిపారు. పనులు సకాలంలో నాణ్యతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని అన్నారు.దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి ఒక్క బీఆర్‌ఎస్ ప్రభుత్వమే చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో, జడ్పిటిసి సాలిగామ బాణయ్య, కోప్షన్ రెహమాత్ ఖన్, సర్పంచ్ అస్ప రమేష్, రుకుం సంతోష్, బోయిని రాజేష్, పుల్గం వెంకటేష్, వార్డ్ మెంబర్ పెండ్యాల వెంకటేష్, ఇనుముల తిరుపతి, పెండ్యాల పోషం, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

