కాగజ్‌నగర్‌లో ఏసీబీ సోదాలు.. రూ.22 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీఓ డోంగ్రే శ్రీనివాస్.
కాగజ్‌నగర్, అక్టోబర్ 29, ( ఆంజనేయులు న్యూస్ )
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యల్లో జీపీఓ డోంగ్రే శ్రీనివాస్ రూ.22 వేల లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు సమాచారం. గతంలోనూ మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కినట్లు తెలిసింది. లంచం తీసుకుంటున్న సమయంలోనే అధికారులు పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ దర్యాప్తు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే వారిపై ఏసీబీ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
