Thursday, October 29, 2026
HomeTelanganaమంచిర్యాలవిద్యార్థులకు భద్రతపై షీ టీమ్ ఎస్‌ఐ హైమ అవగాహన

విద్యార్థులకు భద్రతపై షీ టీమ్ ఎస్‌ఐ హైమ అవగాహన

📰 Generate e-Paper Clip

సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ నిబంధనలపై దిశానిర్దేశం

మంచిర్యాల అక్టోబర్ 28, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా డీసీపీ ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల (బాలికల)లో జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్‌ఐ హైమ మాట్లాడుతూ సమాజంలో షీ టీమ్స్ నిర్వహిస్తున్న పాత్ర, వాటి ముఖ్య ఉద్దేశాలను విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత సమాజంలో సవాలుగా మారిన సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.ఏదైనా ఆపద లేదా సమస్య ఎదురైనప్పుడు ఆలస్యం చేయకుండా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. అలాగే రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385లను సంప్రదించాలని తెలిపారు. ఈ నంబర్లను విద్యార్థులు గుర్తుంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రామ కల్యాణి, షీ టీమ్ సిబ్బంది శ్రవణ్, రాజేందర్, వనిత, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.