Tuesday, November 24, 2026
HomeTelanganaక్రీడలతోనే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి

క్రీడలతోనే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి

📰 Generate e-Paper Clip

కార్మెల్ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన మేయర్ దంపతులు

మంచిర్యాల, నవంబర్ 24, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల పట్టణంలోని కార్మెల్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కార్మెల్ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్‌ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దంపతులు శ్రీ దర్ని మధుకర్, సుజాత ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యం పెంపొందుతాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను చాటుకొని క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్మెల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మరియ అగస్టిన్, ఫాదర్ మనోజ్, పాఠశాల క్రీడా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.