Saturday, November 14, 2026
HomeTelanganaనా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు.. ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు

నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు.. ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు

ఫోన్‌ ట్యాపింగ్‌కు పక్కా ఆధారాలున్నాయన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత..

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, నవంబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ )

ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్‌ చేయిస్తున్నారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్‌ మీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తన ఫోన్‌ను చూపిస్తూ, ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయం ప్రధానికి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమని రాహుల్‌ గాంధీ సవాల్‌ విసిరారు. ముఖాముఖి చర్చ జరిగితే దేశద్రోహులు ఎవరు? విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరున్నారు? అనే విషయాలు ప్రజలకు స్పష్టమవుతాయని అన్నారు. గతంలోనూ పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా తనతో పాటు పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లను నిఘా పరిధిలోకి తీసుకొచ్చారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తాజాగా మరోసారి ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని రాహుల్‌ గాంధీ ప్రస్తావించడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.