నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఆరోపణలు
న్యూఢిల్లీ, నవంబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ మీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తన ఫోన్‌ను చూపిస్తూ, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయం ప్రధానికి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమని...