Friday, September 25, 2026
HomeTelanganaమహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో సతీష్‌ భవాని దంపతుల గురుపూజ

మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో సతీష్‌ భవాని దంపతుల గురుపూజ

అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు.. భక్తులకు సతీష్‌ భవాని ఆధ్యాత్మిక ప్రవచనం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల సెప్టెంబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ )

అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మహాగణాధిపతి నవరాత్రి ఉత్సవాల్లో కామాఖ్యా దేవాలయం చైర్మన్‌, లలిత త్రిపుర సుందరి దేవి ఉపాసకులు సతీష్‌ భవాని దంపతులు పాల్గొని గురుపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్స్‌ యాజమాన్యం వారికి ఘన స్వాగతం పలికి సత్కరించింది. అనంతరం పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌ భవాని మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తూ అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్స్‌ వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ, పలువురికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. ఒక వ్యక్తిగా ప్రారంభమైన అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్స్‌ నేడు మహోన్నత శక్తిగా ఎదగడం అభినందనీయమన్నారు. పదిమందికి సహకరించడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు–అర్జునుడి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేస్తూ.. నైవేద్యాలు సమర్పించడం కంటే పేదవారికి అన్నం పెట్టడం గొప్పదని శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని వివరించారు. పదిమందికి సహాయం చేసే వారు తనకు ప్రీతిపాత్రులని భగవంతుడు పేర్కొన్న సందేశాన్ని గుర్తుచేశారు. శ్రీ మహాగణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సతీష్‌ భవాని భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్స్‌ యాజమాన్యం, భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.