Monday, August 17, 2026
HomeTelanganaఅనుమతులు లేకుండా బోరు త్రవ్వకం.. పార్కింగ్ స్థలం వాణిజ్యానికి?

అనుమతులు లేకుండా బోరు త్రవ్వకం.. పార్కింగ్ స్థలం వాణిజ్యానికి?

📰 Generate e-Paper Clip

మంచిర్యాల మార్కెట్ ఏరియాలో గిన్ని కాంప్లెక్స్ పై ఆరోపణలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో గిన్ని కాంప్లెక్స్ ముందు అనుమతులు లేకుండా బోరు త్రవ్వుతున్నారన్న ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. .అదేవిధంగా, ఆ కాంప్లెక్స్‌లో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాటు, పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని షట్టర్లుగా మార్చి అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వాహనాలు రోడ్లపైనే నిలిపివేయాల్సి వస్తోందని, ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. స్థానికుల ప్రకారం, ఆ భవనానికి సరైన పర్మిషన్ లేకపోవడంతో పాటు, బోరు త్రవ్వకానికి కూడా అనుమతులు లేవని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా నిర్మాణాలు లేదా త్రవ్వకాలు జరిగితే, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.