Friday, July 3, 2026
HomeTelanganaమంచిర్యాలలో దర్జాగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం

మంచిర్యాలలో దర్జాగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం

📰 Generate e-Paper Clip

• బైక్‌పై వచ్చి కవర్లు పంపిణీ.. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పై విమర్శలు

• సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు ఎక్కడ

• పర్యావరణానికి ముప్పు.. ప్రజల్లో ఆందోళన

Post Midle

• చర్యలు తీసుకోవాలంటూ స్థానికుల డిమాండ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో నిషేధం ఉన్నప్పటికీ ప్లాస్టిక్ కవర్ల వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి కూరగాయల వ్యాపారులకు ప్లాస్టిక్ కవర్లు పంపిణీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, మంచిర్యాల పట్టణంలో అమలు మాత్రం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగం కారణంగా కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మున్సిపల్ నిర్లక్ష్యంతోనే పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం పెరిగిపోతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.