మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు చట్టాలపై అవగాహన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థినులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలు ధైర్యంగా ముందుకు సాగి ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో వివరించారు. గొప్ప మహిళల చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. అలాగే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం ఎలా పొందాలో కూడా వివరించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి భాగ్యవతి, మహమ్మద్ సమ్దన్ (చీఫ్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్), సబ్బని సధయ్య (అసిస్టెంట్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్), రాజుర రాములు (అసిస్టెంట్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్) కళాశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు..
