Friday, September 18, 2026
HomeCrimeమోదీ జన్మదినం సందర్భంగా ‘ఆశీర్వాద దీపం’

మోదీ జన్మదినం సందర్భంగా ‘ఆశీర్వాద దీపం’

శ్రీరాంపూర్‌, నస్పూర్‌ జోన్‌లలో ఘనంగా కార్యక్రమం.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష

📰 Generate e-Paper Clip

శ్రీరాంపూర్‌ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమం

మంచిర్యాల, సెప్టెంబర్ 17, ( ఆంజనేయులు న్యూస్ )

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌, నస్పూర్‌ జోన్‌లలో బీజేపీ ఆధ్వర్యంలో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ ఆదేశాల మేరకు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ సూచనతో శ్రీరాంపూర్‌ జోన్‌ అధ్యక్షుడు సత్రం రమేష్‌, నస్పూర్‌ జోన్‌ అధ్యక్షుడు కుర్ర చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన జాతీయ రహదారి వద్ద పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించి, ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాదాలు అందించారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మోదీ మరింత కాలం సేవలందించాలని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.