Monday, August 17, 2026
HomeTelanganaకేటీఆర్ కు తన ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడబిడ్డల!

కేటీఆర్ కు తన ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడబిడ్డల!

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఆడబిడ్డలు కనీసం ఆడపిల్లలు గా కూడా కనపడర!

ఆరిజిన్ డైరీ సీఏఓ షేజల్ ఆవేదన!

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కేటీఆర్ కు తన ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడబిడ్డలు అని తెలంగాణ ఆడబిడ్డలు ను కనీసం ఆడపిల్లలు గా కూడా కనపడరు అని ఆరిజిన్ డైరీ సీఏఓ షేజల్ అన్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునేందుకు సంవత్సరం పాటు కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరిగిన, గల్లీ నుండి ఢిల్లీ వరకు నిరసనలు తెలిపిన కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇచ్చే తీరిక లేని ఘనత కల్వకుంట్ల కుటుంబానికే దక్కుతుందని అన్నారు. మహిళల కోసం తెలంగాణ లో షీ టీమ్ పెట్ట్టామని చెప్తున్న బీఆర్ఎస్ కు చిత్తశుద్ది ఉంటే సొంత పార్టీ నేత దుర్గం చిన్నయ్య మీద కేసు ఎందుకు నమోదు చేయలేదు చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయం గురించి మీడియా సాక్షిగా దేశం మొత్తం చెప్తుంటే కేటీఆర్ కు మాత్రం అవేమీ లేదని చెప్పాను అని ఒక ప్రముఖ ఛానల్ లో పెయిడ్ ఇంటర్వ్యూ లు ఇచ్చుకుంటూ మహిళల పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి బెల్లంపల్లి ప్రజలనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా ఓటు అడిగే హక్కు లేదని ఆమె అన్నారు. కల్వకుంట్ల కుటుంబం కోసమే స్కీములు, స్కాములు అని అసలైన లబ్ది దారులకు అవి ఎప్పటికీ అందని ద్రాక్ష అని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, సుమారు 60 యేండ్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తీర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే అని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. మహిళాలోలుడు, కామ పిశాచి అయిన దుర్గం చిన్నయ్య గురించి ఆధారాలతో సహా ప్రభుత్వానికి  సందేశం పంపినా, సొంత పార్టీ నేత కావడంతో దుర్గం చిన్నయ్య మీద చర్యలు తీసుకోలేదని అన్నారు. మళ్ళీ తిరిగి లైసెన్స్ రెనువల్ చేసి అచోసిన ఆంబోతు మాదిరిగా బీఆర్ఎస్ తరపున బీ ఫారం ఇచ్చి బెల్లంపల్లి ప్రజల మీదకు వదిలారని షేజల్ అన్నారు. అలాంటి ఆంబోతు ను బెల్లంపల్లి ప్రజలు ఈ నెల 30 వ తేదీన జరిగే ఎన్నికలలో ప్రజల పాశుపతాస్త్రం అయిన ఓటు హక్కు ద్వారా కళ్లెం వేసి బందించాలని కోరారు. బెల్లంపల్లి, చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మచ్చ లేని మనిషులని షేజల్ ఓటర్లను అభ్యర్ధించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.