Tuesday, August 18, 2026
HomeTelanganaఉచిత మెగా వైద్య శిబిరం

ఉచిత మెగా వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 17 న స్థానిక వైశ్య భవన్ లో ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వాస్క్యులర్ వైద్య శిబిరమును నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం చైర్మన్, వాసవి క్లబ్ మాజీ గవర్నర్ సిరిపురం రాజేష్, మంచిర్యాల వాసవి క్లబ్ అధ్యక్షుడు నల్మాస్ ప్రవీణ్ తెలిపారు. మంగళవారం ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి వాస్కులర్ వ్యాధిగ్రస్తులు హాజరై ఉచిత వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఐబి  చౌరస్తాలో ఉచిత వాస్క్యులర్  వైద్య శిబిరం ప్రచార ఆటోను ప్రారంభించారు. ఈనెల 17వ తేదీన నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి వ్యాధిగ్రస్తులు  హాజరుకావాలని ఇందుకోసం మంచిర్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆటో ద్వారా ప్రచార కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఈ వైద్య శిబిరంలో ఏషియన్ వాస్క్యులర్ ఆస్పత్రి వైద్య నిపుణులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించడం అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ఉబ్బి మెలక తిరిగే నరాలు, సాలె పురుగు లాంటి నరాలు ఉండడం, కాలు పాదంలో వాపు రావడం, సిరి పుండ్లు, కాళ్లలో, మెదడులో రక్త సరఫరా లేకపోవడం లాంటి లక్షణాలు ఉన్నవారు వాసవి క్లబ్ నిర్వహించే ఈ వైద్య శిబిరంలో వాస్క్యులర్ సర్జన్ ను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకొని అవసరమైతే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వాసవి క్లబ్ రీజియన్ చైర్ పర్సన్ కొంకుముట్టి వెంకటేశ్వర్లు, జోన్ చైర్ పర్సన్ కేశెట్టి  వంశీకృష్ణ, వాసవి క్లబ్ అధ్యక్షుడు నలమాసు ప్రవీణ్, కార్యదర్శి ఎర్రం వెంకటేష్, కోశాధికారి చిలువేరు మహేష్, వాస్క్యులర్  ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ రవికుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.