Tuesday, August 18, 2026
HomeTelanganaకాంగ్రెస్ నుండి అసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా: డా.గణేష్ రాథోడ్

కాంగ్రెస్ నుండి అసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా: డా.గణేష్ రాథోడ్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం జిల్లా: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి రాష్ట్ర స్థాయి నాయకులకు నమ్మకం కల్పించిన డా.గణేష్ రాథోడ్. కాంగ్రెస్ పార్టీ ముందు నుండే పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్ కట్టబెడతామని చెప్పగా పుట్టిన గడ్డ కు ఏ విధంగానైనా రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ జెండాను భుజానికి ఎత్తిన డా.గణేష్ రాథోడ్. గత కొన్ని నెలలుగా సర్వే నిర్వహించిన పార్టీ యంత్రాంగం ఈ రోజు ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ డా.గణేష్ రాథోడ్  కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాతో పాటు కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం పోరాడుతానని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.