Monday, August 17, 2026
HomeTelanganaకాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

📰 Generate e-Paper Clip

చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు

గ్రామం లోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ కు మద్దతు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గంలోని కొటపల్లి మండలం శెట్టిపెళ్లి (శంకరపూర్) గ్రామం లో మంగళవారం ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రచారం చేయడానికి గ్రామానికి వచ్చిన చెన్నూరు నియోజకవర్గం నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు కు డప్పు వాయిద్యాల తో గ్రామంలోకి ప్రజలు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ. బిఆర్ఎస్ కు కంచుకోటగా వున్న శంకరాపూర్ గ్రామం ఏకగ్రీవంగా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ లో చేరడం హర్షణీయం అని అన్నారు. శంకరాపురం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గ పరిధి లోని అన్ని గ్రామాలు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలు ఏకగ్రీవంగా ఐక్యత తో కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలిపి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చడం జరుగుతుంది అని తెలిపారు. ఆ నాడు తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా ప్రచారం చేసుకొని ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడం జరిగింది అని, కేసీఆర్ మాటలకు నమ్మి బిఆర్ఎస్ కు ఓటు వేసి మోసపోవడం జరిగింది అని, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొంది అభ్యున్నతి సాధించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ లో చేరిన కోటపల్లి మండలం శెట్టిపెళ్లి (శంకరపూర్) గ్రామం బి ఆర్ ఎస్ నాయకులు  తాండ్ర పోశయ్య, వేముల లచ్చన్న, సైదల పొశం, మెడి బాన్నయ్య, పుప్పల లచ్చన్న, మాజీ సర్పంచ్ తోట అశోక్, మల్లంపేట మాజీ ఉపసర్పంచ్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, ఎండి తాజ్, చాంద్ బీ, బీబా కు హస్తం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల అధ్యక్షులు కట్రాల మల్లన్న, మాజీ జెడ్పీటీసీ పోటు చిన్న రామ రెడ్డి, మాజీ ఎంపీటీసీ తాళ్ల బాపు, మాజీ ఎంపీటీసీ అరె బాపు, సీనియర్ నాయకులు బన్సీ నాయక్, ఎలుకుచి మల్లన్న, మెన్నం భాస్కర్, సురం మోహన్ రెడ్డి, గ్రామస్థులు, యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.