
ఆంజనేయులు న్యూస్, కొమురంభీం జిల్లా: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి రాష్ట్ర స్థాయి నాయకులకు నమ్మకం కల్పించిన డా.గణేష్ రాథోడ్. కాంగ్రెస్ పార్టీ ముందు నుండే పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్ కట్టబెడతామని చెప్పగా పుట్టిన గడ్డ కు ఏ విధంగానైనా రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ జెండాను భుజానికి ఎత్తిన డా.గణేష్ రాథోడ్. గత కొన్ని నెలలుగా సర్వే నిర్వహించిన పార్టీ యంత్రాంగం ఈ రోజు ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ డా.గణేష్ రాథోడ్ కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాతో పాటు కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం పోరాడుతానని చెప్పారు.