Monday, August 17, 2026
HomeTelanganaజాబితాపై అభ్యంతరాలు ఉంటే అందజేయాలి

జాబితాపై అభ్యంతరాలు ఉంటే అందజేయాలి

📰 Generate e-Paper Clip

జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం పర్యవేక్షకులు అరవింద్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ వైద్య విధాన పరిషత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నందు పొరుగు సేవల పద్దతిన స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీ కొరకు తీసుకున్న దరఖాస్తుల జాబితాపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 26 నుండి 29వ తేదీ సాయంత్రం 5 గం||ల లోగా కార్యాలయ పని దినములలో జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం, జిల్లా ఆసుపత్రి నందు వ్రాత పూర్వకంగా అందజేయాలని జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం పర్యవేక్షకులు అరవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి జాబితా కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచడం జరిగిందని, అభ్యర్థులు గమనించాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.