
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వాసవి క్లబ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్ లో వాసవి క్లబ్స్ జిల్లా మాజీ గవర్నర్ లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పూర్వ గవర్నర్లు కటకం హరీష్, రేణిగుంట్ల శ్రీనివాస్, సిరిపురం సత్యనారాయణ, ముక్త శ్రీనివాస్, ప్రస్తుత గవర్నర్ బాల సంతోష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, వనితా క్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి, కార్యదర్శి గంప వాసవి, కపుల్స్ క్లబ్ అధ్యక్షురాలు గడ్డం రమాదేవి రమేష్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొండ చంద్రశేఖర్, జిల్లా క్యాబినెట్ కోశాధికారి పుల్లూరు బాలుమోహన్, జిల్లా వికేఎస్పీ ఇన్చార్జి అప్పాల శ్రీధర్, రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ చైర్మన్లు కాచం సతీష్, నాగిశెట్టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
