
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వృద్ధాప్యంలో అందరితో కలిసి మెలసి సంతోషంగా జీవించాలని, వృద్ధులు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని షాదిఖానాలో జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.
వృద్ధులు తమ అనుభవంతో భావి తరాలకు మంచి భవిష్యత్ అందించేందుకు మార్గదర్శకత్వం చేయాలని తెలిపారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మానవ సంబంధాలకు అన్నింటి కన్నా ఎక్కువ విలువ ఉండేదని, తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే విలువలు, మానవ సంబంధాలు తెలిసేలా పెంచాలని తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, సమస్యల పరిష్కారం, అవసరాల కొరకు ఉచిత టోల్ ఫ్రీ నంబర్ 14567 ఏర్పాటు చేయడం జరిగిందని, వృద్ధులు ఈ నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వయోవృద్ధులు ఆలపించిన గేయాలు, వయోవృద్ధుల అసోసియేషన్ నుంచి పలువురు అందించిన సందేశాలను ఆకట్టుకున్నాయి. అనంతరం పలువురు వయోవృద్ధులను సన్మానించడంతో పాటు వృద్ధుల హెలైన్ నంబర్ తో కూడిన చేతి పట్టీలను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి చిన్నయ్య, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, డేకేర్ సెంటర్ అధ్యక్షులు మొండయ్య, సి.డి.పి.ఓ.లు, జిల్లా బాలల సంక్షేమ అధికారి ఆనంద్, వయోవృద్ధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



