వృద్ధాప్యంలో అందరితో కలిసిమెలసి సంతోషంగా జీవించాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వృద్ధాప్యంలో అందరితో కలిసి మెలసి సంతోషంగా జీవించాలని, వృద్ధులు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని షాదిఖానాలో జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. వృద్ధులు తమ అనుభవంతో భావి తరాలకు మంచి భవిష్యత్ అందించేందుకు మార్గదర్శకత్వం చేయాలని తెలిపారు....